సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా

70చూసినవారు
సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా
తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ చౌటకూరు మండలం శివంపేటలోని సొసైటీ కార్యాలయం ముందు సీపీఎం ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ.. అకాల వర్షాలతో తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే ఆందోళన చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్