రాయికోడ్ మండలం ఇందూర్ లో డా బాబాసాహెబ్ అంబెడ్కర్ 134 వ జయంతి సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మాజీ ఎంపిటిసి వీణారాణి మహంకాళి బాబసాహెబ్ కు నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ అంబెడ్కర్ అందరివాడు, ఆయన అడుగుజాడల్లో మనమంతా నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, వివిధ సంఘాల ప్రతినిధులు, అంబెడ్కర్ యూత్ సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.