సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని ఆటో డ్రైవర్లు 'మై ఆటో ఇజ్ సేఫ్ స్టిక్కర్స్' ప్రతి ఆటోకు కలిగి ఉండాలని సోమవారం ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు. స్టిక్కర్స్ లేని ఆటోలను సీజ్ చేశామని అన్నారు. స్టిక్కర్స్ లేనివారు ఆటో యొక్క ఆర్ సి , డ్రైవింగ్ లైసెన్స్, ఒక ఫోటో తీసుకొని పోలీస్ స్టేషన్కు వస్తే స్టిక్కర్స్ ఇవ్వడం జరుగుతుందని సూచించారు.