సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండల పరిధిలోని సంగాపూర్ గ్రామంలో మంగళవారం ఏవో అభినాష్ వర్మ రైతులకు తమ పంట సాగు కోసం వివిధ రకాల విత్తనలను కొనుగోలు చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరారు. కొనుగోలు చేసిన బిల్లులపై దుకాణం ముద్ర ఉండేలా చూడాలని, ఫర్టిలైజర్ షాప్ ల వారు ధరలలో వ్యత్యాసం ఉన్న, ఎక్కువ ధరకు అమ్మే వారి వివరాలు వ్యవసాయ అధికారులకు తెలియజేయాలని అన్నారు.