రాయికోడ్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

70చూసినవారు
రాయికోడ్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండలంలో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులకు ఆ గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కేదార్నాథ్ పటేల్ బుధవారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. రంజాన్ పండుగ ప్రారంభంకావడంతో మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన ముస్లిమ్స్, మైనార్టీ సోదరులు ఉపవాస దీక్ష చేస్తున్నారు. తమకు ఇఫ్తార్ విందు ఇచ్చిన కేదార్నాథ్ పటేల్ ను ముస్లిం మైనార్టీ సోదరులు అభినందించారు.

సంబంధిత పోస్ట్