జోగిపేట: అపరిచితుల ఫోన్ కాల్స్ తో జాగ్రత్త: కమిషనర్ తిరుపతి

51చూసినవారు
జోగిపేట: అపరిచితుల ఫోన్ కాల్స్ తో జాగ్రత్త: కమిషనర్ తిరుపతి
జోగిపేట పురపాలక సంఘము పట్టణ ప్రజలకు వ్యాపారస్తులకు తెలియజేయునది ఏమనగా మీ యొక్క షాపు ల వృత్తి వ్యాపార లైసెన్సు లకొరకు గాని లైసెన్సు రెన్యువల్ కొరకు గాని అపరిచితుల నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ వచ్చిన స్పందించి డబ్బులు చెల్లించకండి. మీయొక్క షాపు లైసెన్సు కొరకు జోగిపేట మున్సిపల్ కార్యాలయములో సంప్రదించి చెల్లించగలరు. ఎవరైనా అపరిచితులు ఫోన్ కాల్ చేసిన లేదా మీ వద్దకు వచ్చి లైసెన్సు రీన్యువల్ డబ్బులు అడిగిన ఈ నెంబరుకు 9000012985 కాల్ చేసి నిర్దారించుకోగలరు లేదా అనుమానితులుగా వుంటే స్థానిక పొలీసు స్టేషన్ లో పిర్యాదు చేయగలరని జోగిపేట మున్సిపల్ కమిషనర్ తిరుపతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్