విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జోగిపేటలో 150 పడకల ఆసుపత్రి నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని చెప్పారు. బాగా చదువుకొని తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.