జోగిపేట మున్సిపా లిటీ పరిధిలోని 17 వార్డును అభివృద్ధి పథంలో ఉంచడమే నా మొదటి కర్తవ్యం అని కౌన్సిలర్ చిట్టిబాబు అన్నారు. సోమవారం వార్డులో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించడం కొరకు మున్సిపల్ సిబ్బందిచే గడ్డి మందు స్ప్రే చేయించారు. అలాగే కాలనీ యందు వున్న మాల పోచమ్మ గుడి అభివృద్ధికి సహకరిస్తానని ఆయన కుల పెద్దలకు హామీ ఇచ్చారు. కాలనీలో తిరుగుతూ అక్కడి ప్రజలతో మాట్లాడుతూ.. వారి సమస్యలు తెలుసుకున్నారు.