కొండాపూర్: చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

70చూసినవారు
కొండాపూర్: చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
కొండాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పాఠశాలల్లో విద్యార్థులు చదువుతున్న తీరును విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెలలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్