వట్పల్లి మండలం దుద్యాల గ్రామంలోని సర్వేశ్వరపురంలో హరిహర శేషాద్రి నాథ్ క్షేత్రంలో కార్తీక మాసంలో ద్వాదశి బుధవారం రాత్రి అఖండ కోటి దీపారాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అంబికా శివయోగి మహరాజ్ అఖండ జ్యోతి వెలిగించి దీపారాధన ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.