మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని బొడ్మెట్పల్లి గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేక అర్చనలతో దేవాలయం కిట కిటలాడింది. స్వామివార్ల కళ్యాణ్ ఉత్సవానికి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరయ్యారు.