రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం మధ్యాహ్నం సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటకి రానున్నారు. పట్టణంలో నూతనముగా నిర్మించిన శ్రీ రామచంద్ర ఆలయం, శ్రీ కేతకీ భ్రమరాంబ సమేత మల్లికార్జున ఆలయంలో జరిగే పూజ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.