ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు

54చూసినవారు
హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ గురువారం ప్రారంభించారు. మంత్రులకు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్