వర్షంతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు

591చూసినవారు
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండలంలో శుక్రవారం కురిసిన చిన్నపాటి వర్షానికే ప్రధాన రోడ్డుపై వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కప్పాడు నుండి రాయికోడ్ రోడ్డు పనులు జరుగుతుండడంతో మట్టి పోసి వదిలేయడంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు. అధికారులు స్పందించి పనులు త్వరగా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్