మునిపల్లి మండలం గోపాలరం గ్రామంలో వెంకట కాజా దర్గా 17వ వారోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా భక్తులు పెద్ద ఎత్తున దర్గాలు సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయికుమార్ ప్రత్యేక పూజలు చేశారు.