సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం నుండే ప్రజలు క్యూ లైన్లులో బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రానికి వచ్చేటప్పుడు ఏదైనా ఒకటి ఐడి కార్డు తీసుకురావాలని కోరారు.