ఎస్సీ వర్గీకరణ జరుగుతుండడంతో 40 ఏళ్ల కల సహకారమైందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ వల్ల కొందరు భయాందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. వర్గీకరణతో ఎవరికి నష్టం జరగదని భరోసా ఇచ్చారు. తిప్పరం కోర్టు తీర్పు మేరకు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.