సుదీర్ఘకాలం తర్వాత ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇప్పించిన ఘనత పిఆర్టియుకే దక్కిందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ గోపాల్ అన్నారు. మునిపల్లి మండల సంఘ సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. రాబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ పిఆర్టియు అభ్యర్థి గెలిపించేలా ఇప్పటినుంచి కృషి చేయాలని కోరారు.