సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన 21 నూతన ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. శనివారం ఎంఈఓ, సిహెచ్ఎం, ఎంఐఎస్, సిఓలతో ఏర్పాటు చేసిన జూమ్ సమావేశంలో డీఈఓ మాట్లాడుతూ నూతన పాఠశాలల కోసం ప్రభుత్వ భవనాలు లేదా అద్దె భవనాలను గుర్తించి, వాటికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.