సంగారెడ్డి జిల్లా మండలకేంద్రమైన రాయికోడ్ లోని ఆదర్శ పాఠశాల/కళాశాలలో 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు పలు సబ్జెక్ట్ లు బోధించుటకు డిగ్రీ, బీఈడీ, టిజిటీ అభ్యర్థులు మంచి అవకాశం ఉంది. 9, 10వ తరగతి, ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం వరకు గంటల ప్రాతిపదికన పలు సబ్జెక్ట్ లు బోధించుటకు పోస్ట్ గ్రాడ్యుయేట్ బీఈడీ పిజిటీ అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ మంజుల రాణి బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు.