సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని జోడు లింగాల జోగినాధ స్వామి జాతర 21 రోజుల పాటు కొనసాగింది. ఈ జాతరకు వందేళ్ల చరిత్ర కలిగి ఉంది. ఈ జాతరలో మూడు కార్యక్రమాలు కీలక ఘట్టాలు. రథోత్సవం, శివ పార్వతిల కళ్యాణోత్సవం, చివరి ఘట్టం రావణాసురుడు దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ రావణ దహన కార్యక్రమం శుక్రవారం రాత్రి పది తలల రావణాసురుడు ప్రతిమ దహనం చేశారు.