అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురికి ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన చెక్కులను రేగోడ్ మండలంలోని పలు గ్రామాల్లోని 18 మంది లబ్దిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రతి నెల సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు.