సంగారెడ్డి జిల్లా రాయికోడ్ శివారులో వెలసిన శ్రీరేణుకా ఎల్లమ్మ తల్లికి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాసం ను పురస్కరించుకుని ఆదివారం అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన తదుపరి భక్తులు నైవేద్యాలు పెట్టి, ఒడి బియ్యం పోయడం జరిగింది. తర్వాత డప్పుచప్పులతో శివసత్తుల పునకలతో, పిల్లలు, పెద్దలు, యువకుల నృత్యాలతో పురవిధులగుండా ఊరేగింపు నిర్వహించి మహిళలు అమ్మవారికి బోనాలను సమర్పించడం జరిగింది.