సదాశివపేట మండల వనరుల కేంద్రంలో పనిచేస్తున్న నిరంజన్, కల్పన, కనిష్క, రాజు ఉపాధ్యాయులుగా ఎంపిక కావడంతో శుక్రవారం వారిని ఎంఈఓ సన్మానించి అభినందించారు. ఎంఈఓ శంకర్ మాట్లాడుతూ.. అంకిత భావం తో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది రాజేశ్వర్, నాగరత్నం, నాగేశ్, సరస్వతి, నాగరాణి, లక్ష్మణ్ పాల్గొన్నారు.