సంగారెడ్డి: నూతన పాఠశాలలకు ఉపాధ్యాయుల నియామకం

4చూసినవారు
సంగారెడ్డి: నూతన పాఠశాలలకు ఉపాధ్యాయుల నియామకం
రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు చేయనున్న 4 ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులను నియమిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ పాఠశాలలో పనిచేస్తున్న 14 మంది ఉపాధ్యాయులను ఆయా పాఠశాలల్లో విద్యాబోధన చేయడానికి నియమించామని డీఈఓ ఆదివారం తెలిపారు. వీరందరూ మండల విద్యాధికారి కార్యాలయం రామచంద్రపురంలో రిపోర్ట్ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్