కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకము ద్వారా వివిధ అంతర్జాతీయ మరియు జాతీయ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. యువత చదువుతోపాటు సమైక్యత భావనను, మానవీయ విలువలను నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ విద్యాసాగర్ తెలిపారు.