సంగారెడ్డి జిల్లాలో గత సంవత్సరం వేసవి సెలవుల్లో ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు మంజూరు చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని సంబంధిత ఉపాధ్యాయులు గమనించాలని సూచించారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈఓకు కృతజ్ఞతలు తెలిపారు.