సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల వ్యాప్తంగా హనుమాన్ జన్మోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా అర్చకులు వేదమంత్రోచ్చరణలతో అంజనేయుడికి అభిషేకం చేసి, చందనం పెట్టి, తమలపాకుల మాలలు, పూలదండలతో అలంకరించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, మహా హారతి ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు. పిల్లలు, పెద్దలు, యువకులు, మహిళలు భగవంతుని నామస్మరణ చేస్తూ, శోభాయాత్రను వైభవోపేతంగా నిర్వహించారు.