సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండలం మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ శుక్రవారం ఇటికేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరుగనున్న పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు భవిష్యత్ గురించి దిశా నిర్దేశం చేయనున్నారని, ఈ సభకు రాయికోడ్ మండలంలోని ప్రజలు, పార్టీ కార్యకర్తలు హాజరై భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు.