సంగారెడ్డి జిల్లా, మండల కేంద్రమైన రాయికోడ్ లోని హనుమాన్ మందిరం పునఃప్రారంభం మహోత్సవంలో భాగంగా జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా 21వ తేదీన జరిగే హనుమాన్ ఆలయ పునఃప్రారంభ మహోత్సవం, మహా అన్నదానం కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి దామోదర రాజనర్సింహకు మరియు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్యకు గురువారం ఆహ్వానం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, యువకులు, పలువురు నాయకులు కరపత్రాలను అందించి ఆహ్వానించారు.