సంగారెడ్డి జిల్లా కులబుగురు గ్రామంలో శ్రీ సరస్వతి శిశు మందిరం ఉన్నత పాఠశాలలో శుక్రవారం ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులకు ముగ్గుల పోటీలు మరియు గాలిపటాలు ఎగురవేసే కార్యక్రమాలను నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరసింహ గౌడ్ భోగి, సంక్రాంతి, కనుమ విశిష్టతలను తెలుపు విద్యార్థులను ఎంతగానో ఉత్తేజపరిచారు. అనంతరం ఆటల పోటీలో గెలిచినవారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించారు.