సంగారెడ్డి జిల్లాలో ఈనెల 20 నుంచి 24 వరకు ఎస్జీటీ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ. ఈ శిక్షణను మండల స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మండల విద్యాధికారులకు సూచించారు. శిక్షణకు మండలంలోని ఎస్జీటీ ఉపాధ్యాయులందరూ హాజరు కావాలని పేర్కొన్నారు.