సంగారెడ్డి పట్టణంలో శుక్రవారం సీపీఎం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి జి జయరాజు మాట్లాడుతూ.. పూలే స్ఫూర్తితో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ సంగారెడ్డి ఏరియా కార్యదర్శి ఎం. యాదగిరి, నాయకులు హనుమంతు, మురళి మహేష్, విట్టల్, అలీ భాయ్ పాల్గొన్నారు.