మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరిధిలోని వేల్పుగొండ గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులే ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తించారు. ఎంఈఓగా వర్ష ప్రధానోపాధ్యాయులుగా విశాల్ ఉపాధ్యాయులుగా మహేశ్వరి, శ్రీనిధి, శ్వేత పవిత్ర, నియమించబడ్డారు. విద్యార్థులు బోధన తరగతులను పర్యవేక్షించి ఉత్తమ బోధన కనబరిచిన విద్యార్థులకు బహుమతులు మెమోంటోలు అందచేశారు.