చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్‌లోని జేఎన్టీయూ కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ. కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని కోరారు. అనంతరం వినతిపత్రాన్ని అధికారులకు సమర్పించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.