సింగూరు ఎడమ కాలువ పనులు నాసిరకంగా చేస్తున్నారని ఆందోలు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. పుల్కల్ మండలం సింగూరు లోని ఎడమ కాలువ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి దామోదర్ అండతో కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.