నిషేధిత గుట్కా విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్సై

72చూసినవారు
నిషేధిత గుట్కా విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్సై
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలో ఎవరైనా నిషేధిత గుట్కాలు విక్రయిస్తే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శనివారం ఎస్ఐ వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పోయిన నెల మే 24న గవర్నమెంట్ గుట్కాను బ్యాన్ చేసిందన్నారు. మండలంలో దుకాణాలు, పాన్ షాప్ లలో గుట్కాలు అమ్మినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం తెలిపిన వారిని గోప్యంగా ఉంచుతామన్నారు.

సంబంధిత పోస్ట్