

అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విమానం (వీడియో)
గుజరాత్ అహ్మదాబాద్‌లోని మేఘని నగర్ ప్రాంతంలో ఒక ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలడంతో దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదికలు సూచిస్తున్నాయి. అత్యవసర సేవలు సంఘటనా స్థలంలో అందుబాటులో ఉన్నాయి. విమానాశ్రయం నుంచి దాదాపు 15 కిలోమీటర్లు దూరంలో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ప్రమాదం జరిగిన ప్రదేశం మొత్తం నల్లటి పొగతో కమ్ముకుంది.