జిల్లాలో మంగళవారం 17 మండలాలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా శ్రీరాంపూర్ మండలం కడపలో 41. 1, పటాన్చెరు మండలం పాశం మండలంలో 40. 8, చౌటకూరు, జిన్నారం, కోహీర్ మండలం దిగ్వాల్ 40. 7, కల్హేర్, నారాయణఖేడ్ 40. 6, వట్టిపల్లి, పుల్కల్ 40. 5, వట్టిపల్లి మండలం పాల్వంచ 40. 4, జహీరాబాద్, కంగ్టి, హత్నూర మండలం గుండ్ల మాచనూరు 40. 3 నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.