హనుమాన్ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో రంగంపేట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు హనుమంతునికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను అర్చకులు వేదమంత్రాలతో జరిపించారు. హనుమంతుని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.