తన పుట్టినరోజును పురస్కరించుకొని గునెల్లిస్ ఫౌండేషన్ ప్రతినిధి రోహిత్ పాఠశాల అభివృద్ధికి ధనవంతుగా ఆర్థిక సహాయాన్ని అందించారు. మంగళవారం జహీరాబాద్ మండలం పరిధిలోని రంజోల్ గ్రామ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో భాగంగా పాఠశాలకు గేటును ఏర్పాటు చేయించేందుకు రూ. 20 వేల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు విష్ణు, సోహెల్, ప్రేమ్, అభి, ఖదీర్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.