సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం గ్రామానికి చెందిన మద్దూరి మురళీకృష్ణ ఇటీవల 22 రోజులపాటు AI శిక్షణ పొందారు. ఈ శిక్షణ తెలుగు AI బూట్ క్యాంప్ పేరుతో ప్రముఖ మెంటర్ నికీలు గుండా వద్ద నిర్వహించబడింది. AI వినియోగం,వ్యాపార అభివృద్ధిలో దాని ప్రాముఖ్యత ఇంటి వద్ద ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై శిక్షణ అందించారు. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న మద్దూరి మురళీకృష్ణకు మార్చి 9న T-Hubలో పట్టా ప్రధానం జరిగింది. ఈ వేడుకలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండా, అభిషేక్ బొడ్డు, బిఎన్‌ఎస్ శ్రీనివాస్ పాల్గొన్నారు. AI అనేక విభాగాల్లో ఎలా ఉపయోగపడుతుందో భవిష్యత్తులో దాని వృద్ధి అవకాశాలు ఎలా ఉంటాయో చర్చించబడింది. వ్యాపారం, విద్య, ఇంటి ఆధారిత ఉపాధి వంటి రంగాల్లో AI ప్రాముఖ్యతపై ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ శిక్షణ ద్వారా మురళీకృష్ణకు AI పై విస్తృత అవగాహన కలిగిందని తెలిపారు. తన భవిష్యత్తులో AI నేర్చుకుని దీన్ని మరింతగా ఉపయోగించుకునేందుకు సిద్ధమని చెప్పారు. నిపుణులు భవిష్యత్తులో AI నేర్చుకుని ఉపాధిని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.