పదో తరగతి ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్ లకు పంపిస్తున్నామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. 16వ తేదీన పేపర్ 1, 19న పేపర్ 2 ప్రశ్నాపత్రాలు పోలీస్ స్టేషన్ లకు చేరుకుంటాయని పేర్కొన్నారు. సూపరిటెండ్లు, డిపార్ట్మెంట్ అధికారులు డబుల్ బాక్స్ లాకర్లతో పోలీస్ స్టేషన్ లకు ఆయా తేదీల్లో ఉదయం 10 గంటలకు చేరుకోవాలని సూచించారు.