కల్హేర్ లో వైభవంగా బీరప్ప విగ్రహాల ఊరేగింపు

80చూసినవారు
నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండల కేంద్రంలో బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కోసం బుధవారం ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. గొల్ల కురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలో విగ్రహాలను ట్రాక్టర్ లో పెట్టి ప్రదర్శించారు. మహిళలు నృత్యాలు చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెరుమాళ్ల లచ్చవ్వ, గ్రామస్తులు రమేష్ గౌడ్, నారా గౌడ్, రఘువీర్, యాదవ సంఘం బాధ్యులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్