సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో అంగన్వాడీ ఆధ్వర్యంలో గురువారం బడి-బాట కార్యక్రమాన్ని ఐసీడీఎస్ సూపర్వైజార్ సుజాత ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు నిర్వహించారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలందర్నీ అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని అంగన్వాడీ టీచర్లు పిల్లల తల్లి దండ్రులను కోరారు. ఇందులో భాగంగా 5 సంవత్సరాల లోపు పిల్లలకి, బాలింతలకు, తల్లులకు సైతం ఎగ్ బిర్యానీ పెట్టడం జరిగింది.