నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావుపేట గ్రామంలో మంగళవారం రాత్రి శ్రీ లక్ష్మీ అనంతశయన స్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా అనంత పద్మనాభ స్వామికి గ్రామ పుర వీధుల్లో శేష వాహనంపై పల్లకి సేవ, శోభయాత్ర నిర్వహించారు. బాజా భజంత్రీలతో గ్రామస్థులు పెద్ద ఎత్తున ఊరేగింపు చేపట్టారు. దారి పొడవునా గ్రామస్థులు స్వామి వారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.