శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి ఆషాఢ మాస ప్రత్యేక పూజలు

82చూసినవారు
శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి ఆషాఢ మాస ప్రత్యేక పూజలు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున అతి పూరితమైన ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి గురువారం ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు భాగంలో ఉదయం ఆలయ అర్చకులు నాగేష్ స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకంతో పట్టువస్త్రాలతో అమ్మవారికి ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు నాగేష్ స్వామి మాట్లాడుతూ. గ్రామంలో ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో ప్రతి గడప నుండి ప్రతి ఆడపడుచు తీరోక బోనాలతో వాడ వాడల నుండి అమ్మవారికి బోనాల ఊరేగింపుతో బయలుదేరుతారని ఆలయ అర్చకులు నాగేష్ స్వామి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :