కంగ్టి జ్ఞాన వికాస్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు

84చూసినవారు
కంగ్టి జ్ఞాన వికాస్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని జ్ఞాన వికాస్ పాఠశాలలో మంగళవారం బాలికలు బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. దసరా సెలవు సందర్బంగా ముందుగానే పాఠశాలలో బతుకమ్మ వేడుకలు జరిపారు. ఈ మేరకు పూలతో బతుకమ్మలను తయారు చేసి మధ్యలో బతుకమ్మను పెట్టి బాలికలు పాటలు పడుతూ బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్