నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం గాజులపాడు గ్రామానికి చెందిన 25 మందిని బైండోవర్ చేసినట్లు కంగ్టి ఎస్సై విజయ్ కుమార్ సోమవారం సాయంత్రం తెలిపారు. ఆదివారం గాజులపాడు గ్రామంలో ఇరు వర్గాలకు చెందిన వారు గొడవలు పడి దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఈ మేరకు ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి స్థానిక ఎమ్మార్వో ఎదుట ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున డిమాండ్ తో బైండోవర్ చేసినట్లు తెలిపారు.