ఎలాంటి ఆంక్షలు లేకుండా నారాయణఖేడ్ నియోజకవర్గ రైతులందరికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఖేడ్ పట్టణంలోని రాజీవ్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఎం. భూపాల్ రెడ్డి అన్నారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేయడం జరుగుతుంది కావున పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల బాద్యులు హాజరు కావాలి అన్నారు.